ప్రభుత్వ వైఫల్యం అధికారుల నిర్లక్ష్యమా?
:యాసంగి బోనస్ డబ్బులు పడేనా?
: యాసంగి బోనస్ డబ్బులు పడేదాకా ఐకెపిలను ఆపాలి: అన్నెం అంజిరెడ్డి
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 27(ప్రతినిధి మాతంగి సురేష్): యాసంగి బోనస్ డబ్బులు రైతులకి తక్షణమే వేసి ఖరీఫ్ వడ్లను తీసుకోవాలని బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అన్నెం అంజిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రామలక్ష్మిపురం గ్రామానికి చెందిన అంజి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని యాసంగి వడ్లకు ఇంతవరకు వేయలేదని దీనికి ప్రభుత్వ వైఫల్యం అధికారుల నిర్లక్ష్యమా అని అన్నారు. ఖరీఫ్ పంట కొనుగోలు కంటే ముందే యాసంగి బోనస్ రైతులకు వేయాలని అన్నారు. రైతులు సన్న రకం దాన్యం వేయడం వలన పెట్టుబడి ఎక్కువ వస్తుందని అన్నారు. తక్షణమే యాసంగి బోనస్ వేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.



