ప్రైవేటు ఉపాధ్యాయురాలికి టిపిటిఎల్ఎఫ్ నిత్యవసర సరుకులు పంపిణీ
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 30(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీదేవికి టిపిటిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు 25 కేజీల బియ్యం జిల్లా అధ్యక్షులు జె నరసింహారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కొరకు టిపిటిఎల్ఎఫ్ నిరంతర పోరాటం చేస్తున్న ఆపదలో ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కరోనా సమయంలో ఇప్పటి వరకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూ వచ్చామన్నారు. భవిష్యత్తులో మరెన్నో మా సహాయ సహకారాలు ఉపాధ్యాయులకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ టిపిటిఎల్ గౌరవ అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గురవయ్య, ప్రధాన కార్యదర్శి కారింగుల శ్రీనివాస్, రాజా తదితరులు పాల్గొన్నారు.



