బస్ స్టాప్ లో ఇద్దరు చిన్న పిల్లల్ని
సంగారెడ్డి జిల్లా,ఆగష్టు 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పటాన్ చేరు పట్టణంలోని బస్ స్టాప్ లో ఇద్దరు చిన్న పిల్లల్ని వదిలి వెళ్ళిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు.
ఒక బాబు,ఒక పాప ఉన్నారు.వీరికి మాటలు కూడా సరిగారాని ఈ పిల్లల ఆచూకీ కోసం ఎదురు చూసిన స్వీపర్.
ఎవరు రాక పోవడంతో అక్కున చేర్చుకొని పిల్లలను తన దగ్గరే ఉంచుకుంది.
పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లల తల్లిదండ్రుల ఆచూకీ కోసం అప్పజెప్పింది.
పోలీసులు ICDS అధికారులను సంప్రదించి వారికి పిల్లల్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టారు.
సిఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ పిల్లలను గుర్తించిన వారు పటాన్ చేరు పోలీస్ స్టేషన్ కు సమాచారం తెలియజేయాలన్నారు.