Tuesday, December 23, 2025
[t4b-ticker]

బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం…….

బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం…….

Mbmtelugunews//కోదాడ, నవంబర్ 26(ప్రతినిధి మాతంగి సురేష్): భారత్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాం గం పౌరులు పాలకులు, పాలన యంత్రాంగం, పాటించవలసిన అత్యున్నత చట్టంగా దీన్ని పేర్కొంటారు అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరుపతయ్య అన్నారు. ముందుగా బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి స్వేచ్ఛకు సర్వతో ముఖాభి వృద్ధికి రాజ్యాంగం హామీ ఇస్తుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న ఇండియా… రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవం గా కూడా జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత దేశం… రాజ్యాంగాన్ని దత్తత చేసుకుంది. అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ… రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఐతే… ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని మాత్రమే దేశ ప్రజలు ఎక్కు వగా జరుపుకుంటున్నారు. ఈ రాజ్యాంగ దినోత్సవం కొత్తది కావడంతో… దీనికి అంతగా ప్రాచుర్యం కలగలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ కాజ, మంద మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular