మల్లీశ్వరి కి న్యాయం చేయాలి నిందితుడిని ఉరి తీయాలి
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 17 (ప్రతినిధి మాతంగి సురేష్):కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న మల్లీశ్వరి కి న్యాయం చేయాలి మల్లీశ్వరి మృతికి కారణమైన నిందితుడిని ఉరి తీయాలనే నినాదంతో స్వేరోస్ అంబేద్కర్ వాదులు కోదాడలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.మల్లీశ్వరిని ప్రేమించి కుల వివక్ష కారణంగా మరొకరిని వివాహం చేసుకొని మానసిక శోభకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా కారణమైన జాన్ రెడ్డి అనే నిందితుడిని ఉరితీయాలి అని ఈ సందర్భంగా వాళ్లు డిమాండ్ చేశారు.కోదాడలోని అంబేద్కర్ విగ్రహం నుంచి పూలే విగ్రహం దాకా జరిగిన ఈ ర్యాలీలో స్వేరోస్ రాష్ట్ర నాయకులు చెరుకుపల్లి కిరణ్,చెడపంగు రవికుమార్,చెడపంగు నాగార్జున,ఎలమర్తి వెంకటేశ్వర్లు,రాహుల్,క్యాండీ,నీలేష్,సైదులు తదితరులు పాల్గొన్నారు.