మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన పాలన దినోత్సవం వేడుకలు
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 14 (ప్రతినిధి మాతంగి సురేష్)స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ నందు స్వపరిపాలన వేడుకలను పిల్లలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. దీనిలో భాగంగా పిల్లల్ని అనేక విధములుగా ఉపాధ్యాయులుగా,వివిధ హోదాలలో పలువురిని ఆకర్షించారు.దీనిలో భాగంగా మధ్యాహ్నం సమయంలో పిల్లలందరూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అందులో భాగంగా పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ చాచా నెహ్రూకు పిల్లలతో గల అనుబంధాన్ని గుర్తు చేశారు.దీనిలో భాగంగా పిల్లలు కూడా వివిధ పదవులు అలంకరించిన వారు వారి అనుబహాలను తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు.ఈ సమావేశం అధ్యంతం అందరినీ ఆకట్టుకున్నది. ఈ సమావేశంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,విద్యార్థులు,విద్యార్థులు తల్లిదండ్రులు,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు