ముక్తేశ్వరం మేజర్ సిక్సెల్ మైనర్ కాలువ కూలిన పిల్లర్ ను పరిశీలించిన అధికారులు.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 03(ప్రతినిధి మాతంగి సురేష్):ముక్తేశ్వరం మేజర్ సిక్స్ ఎల్ మైనర్ కాలువ పిల్లర్ కూలడం మూలాన నీళ్లు స్టోరేజ్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల ఆదేశానుసారం బుధవారం డివిజనల్ ఇంజనీర్ సురేఖ, సూపర్వైజర్ వర్క్ ఇన్స్పెక్టర్ అధికారులు కాలువలో పగిలిన సిక్స్ సెల్ పిల్లర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ మాట్లాడుతూ కాలువ పై రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని కాలువపై రెండు కిలోమీటర్ల మేర బిటి రోడ్డు నిర్మాణం, 6,వ కాలువ పూడిక పనులు చేయాలని రైతుల పక్షాన కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు నలజాల రామారావు, మండాది శీను, వీరేపల్లి నాగమోహన్ రావు, శ్రీను, తదితరులు రైతులు ఉన్నారు.



