ముత్తినేని సైదేశ్వరరావు తీరుతో తెదేపాకు తీరని నష్టం……….
:అనధికారిక సమావేశాలపై రాష్ట్ర, కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు……..
:స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు కార్యకర్తలు కృషి చేయాలి……
:తెదేపా కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ ఓరుగంటి ప్రభాకర్…….
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 07(ప్రతినిధి మాతంగి సురేష్): ఎవరికి సమాచారం లేకుండా అనధికారికంగా తనకి ఇష్టం వచ్చిన విధంగా సమావేశాలు నిర్వహిస్తున్న ముత్తినేని సైదేశ్వరరావు తీరుతో తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆ పార్టీ కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ ఓరుగంటి ప్రభాకర్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సైదేశ్వర రావు తీరును తీవ్రంగా ఖండించారు. రెండు సంవత్సరాల క్రితమే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలు అన్ని రద్దు చేయబడ్డాయని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మండల,జిల్లా, రాష్ట్ర కమిటీలు లేకపోయినా పార్టీ నియమావళికి విరుద్ధంగా కార్యకర్తలను తప్పుదోవ పట్టించి గందరగోళం సృష్టించడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బ తినడంతో పాటు పార్టీకి తీవ్ర నష్టం కలిగిద్దని హెచ్చరించారు. అనధికారిక సమావేశాలు ఏర్పాటు చేయడంపై కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన ప్రతిచోట ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో వేమూరి సత్యనారాయణ, జనపనేని కృష్ణ,వేమూరి సురేష్,గోపి, పిడతల శ్రీను, బండ్ల యాదయ్య, నెల్లూరి రవి, శ్రీనివాస్ గౌడ్, సైదా, వనపర్తి నాగేశ్వరరావు, లక్ష్మయ్య, వీరస్వామి, నాగరాజు, వీరబాబు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు…….



