మూగ జీవాల పై మనసున్న మారాజులు- నిలిచిన చిట్టి కుక్కపిల్లల ప్రాణాలు
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 13 ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణం లోని బైపాస్ పక్కన ఉదయం పాదచారులు జాకింగ్ చేసే వారితో రద్దీగా ఉండే గ్రౌండ్ లో ఎవరో గుర్తు తెలియని వారు 7 పిల్లలు గల తల్లికుక్కను పిల్లలను వదిలి వెళ్లగా వాకింగ్ కోసం అటుగా వెళ్లిన ఎల్ఐసి ఏజెంట్ తుమాటి సురేష్ రెడ్డి,రిటైర్డ్ టీచర్ పాయిలి కృష్ణయ్యలు గమనించి వాటిని పక్కనే ఫెన్సింగ్ ఉన్న ప్లాట్లోకి తరలించి తల్లికి ఆహారం పిల్లలకిపాలు పోసి వాటికి సాంత్వన కల్పించారు.మధ్యాహ్నం సమయానికి ఎండ వేడికి తాళలేక సొమ్మసిల్లిన కుక్కపిల్లను ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకుని రాగా 108 ఫారన్ హీట్ జ్వరంతో కోమాలోకి వెళ్లిన కుక్కపిల్లకి వైద్యం చేస్తుండగా మరణించింది.
కన్నీటి పర్యంతమైన అసిస్టెంట్ డైరెక్టర్ డా,, పి పెంటయ్య వెంటనే సిబ్బందితో కలసి కుక్క పిల్లలు ఉన్న ప్రాంతాన్ని సందర్శించి పిల్లలను చల్లటి వాతావరణంలోకి పెట్టి వాటికి ఆహారం అందించి ప్రథమ చికిత్సలు సపర్యలు చేసి విషయాన్ని సామాజిక మద్యమం ద్వారా తెలియజేయగా జంతు ప్రేమికులు నాలుగు పిల్లలను సాదుకోవడానికి తీసుకెళ్లారు.మిగిలిన పిల్లలు తల్లి భాద్యత సురేష్ రెడ్డి తీసుకోవటంతో తల్లీ 7 పిల్లల ప్రాణాలు నిలిచాయి.స్వంత తోబుట్టువులు సైతం తమవారు ఆపదలో ఉన్నా పట్టించుకోని సంఘటనలు చూస్తున్న ఈరోజుల్లో ఇలా మానవత్వంతో 7 ప్రాణాలు కాపాడిన పాయిలి కృష్ణయ్య,సురేష్ రెడ్డి మానవత్వం అభినందనీయం అని పలువురు వాపోతున్నారు.