రాజీ మార్గమే రాజమార్గం:కె సురేష్ సీనియర్ సివిల్ జడ్జి.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 13 ( ప్రతినిధి మాతంగి సురేష్): రాజీమార్గమే రాజా మార్గమని లోక్ అదాలత్ ల ద్వారా కేసులు రాజీ పడి ఇరుపక్షాలు తమ సమయం,డబ్బు ఆదా చేసుకోవచ్చని సీనియర్ సివిల్ జడ్జి కె సురేష్ అన్నారు.
శనివారం కోదాడ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇరుపక్షాలు లోక్ అదాలత్ లో తమ కేసులు రాజీ పడడం ద్వారా సమన్యాయం జరుగుతుందని,కోర్టుల చుట్టూ తిరిగి తమ అమూల్యమైన సమయం,డబ్బు వృధా చేసుకోవద్దని,క్షణికావేశంలో జరిగే తప్పులను సరిడీటీసుకోవడానికి రాజీ మార్గం మంచిదన్నారు.అన్నివర్గాల ప్రజలు చట్టప్రకారం తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ,నేరాలకు దూరంగా సక్రమమైన మార్గంలో వెళ్లాలని కోరారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె భవ్య గారు,1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎండి ఉమర్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్డి జాకీయా సుల్తానా, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సిహెచ్ సత్యనారాయణ,బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ,లోక్ అదాలత్ సభ్యులు తమ్మినేని హనుమంతరావు,కోడూరు వెంకటేశ్వరరావు,టి.సీతారామరాజు,జె.శివకృష్ణ ,సీనియర్ న్యాయవాదులు ఎస్.రాధాకృష్ణ మూర్తి,సిలివేరు వెంకటేశ్వర్లు,గట్ల నర్సింహారావు, ఈదుల కృష్ణయ్య,నాగుబండి కృష్ణమూర్తి, నవీన్,చలం,కె.మురళి,గోవర్ధన్,హేమలత,ఏ పి.పి.గౌస్ పాషా,కోర్టు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శనివారం జరిగిన లోక్ అదాలత్ లో పరిష్కారం అయిన కేసుల వివరాలు చెక్ కేసులు 11, డివిసి కేసులు 5, బ్యాంక్ కేసులు 19 ద్వారా 1,51,558/-రూ. లు, బిఎస్ఎన్ఎల్ కేసులు 5,సివిల్ కేసులు13, క్రిమినల్ కేసులు రాజీపడినవి 51, నేరం ఒప్పుకున్నవి 41 కేసుల ద్వారా ఫైన్ రూ.1,11,050/-రూ.లు, ఈ పెట్టీ కేసుల ద్వారా ఫైన్ రూ.5,93,280/-రూ.లు వసూలు జరిగి కేసులు పరిష్కరించబడినాయని మండల లీగల్ సర్వీస్ కమిటీ తెలిపింది.



