రాములు మరణ వార్త తీవ్రంగా కలచివేసింది: మల్లయ్య యాదవ్
Mbmtelugunews// కోదాడ, సెప్టెంబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త తమలపాకుల రాములు అనారోగ్య తో మరణించారు.రాములు మరణ వార్త మనసుని తీవ్రంగా కలిసి వేసిందని మాజీ ఎమ్మెల్యే,టిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. తమలపాకుల రాములు మరణ వార్త తెలుసుకొని శుక్రవారం మృతిని నివాస గృహానికి వెళ్లి పార్ధివ దేహాం పై పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాములుతో గత 20సంవత్సరాలుగా ఉన్న అనుభందాన్ని నెమర వేసుకుని రాములు మరణవార్త తీవ్రంగా కలచివేసిందని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రాములు కుటుంబానికి అండగా ఉంటానని మనోధైర్యం కల్పించి సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, టిఆర్ఎస్ మండల నాయకులు బెల్లంకొండ బ్రహ్మం,అన్నెం అంజిరెడ్డి, షేక్ ఉద్ధాండు, అన్నెం వెంకట్ రెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బానోతు చంద్యా, అభిధర్ నాయుడు, కిట్టు తదితరులు పాల్గొన్నారు.



