Thursday, April 16, 2026
[t4b-ticker]

లైసెన్సు లేకుండా బండి నడపవద్దు….

లైసెన్సు లేకుండా బండి నడపవద్దు….

:రోడ్డు భద్రత గురించి విద్యార్థులకు అవగాహన….

:హెల్మెట్ తప్పనిసరి….

:ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి.

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 16(ప్రతినిధి మాతంగి సురేష్): గురువారం నాడు కోదాడ పట్టణంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో కోదాడ పట్టణం ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి పాల్గొని మాట్లాడినారు. తెలంగాణ రాష్ట్రం” ప్రజా పాలన ప్రణాళికా ప్రగతి “కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత పాటించవలసిన నియమ నిబంధనలను తెలియజేసినారు. విద్యార్థులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే, వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష పడుతుందని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దు, వాహనంపై నడిపే వారితో పాటు కూర్చున్న వారు కూడా హెల్మెట్ ని ధరించాలని, అతివేగంగా వాహనాలు నడపొద్దు ప్రాణాలను కోల్పోవద్దు అని విద్యార్థులకు తెలియజేప్పినారు. సెల్ ఫోనులో వాట్సప్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లలో పరిచయం లేని వారి రీల్స్ చూడవద్దు, లింకులు తెరవొద్దు, విద్యా విషయ పరిజ్ఞానం కోసమే సెల్ ఫోన్ ఉపయోగించాలని, సైబర్ క్రైమ్ దూరంగా ఉండాలని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, తల్లిదండ్రులకు సంతోషాన్ని కీర్తి ప్రతిష్టలు తేవాలని, ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ, ట్రాఫిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular