విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్ దగ్ధం
:లబోదిబోమంటున్న రైతు
:భయాందోళనలో గ్రామస్తులు
:ఇంత జరిగిన స్పందించని విద్యుత్ శాఖ అధికారులు
Mbmtelugunews//హుజూర్ నగర్/చింతలపాలెం,నవంబర్ 23(ప్రతినిధి చింతారెడ్డి గోపిరెడ్డి):చింతలపాలెం మండల కేంద్రంలో గడ్డితో వెళ్తున్న ట్రాక్టరుకు విద్యు త్ వైర్లు తాకడంతో మంటలు ఎగసి,ట్రక్కుతో సహ గడ్డి దగ్ధమైన సంఘటన శనివారం చోటుచేసు కుంది.వివరాలు ఇలా ఉన్నాయి. వేపలసింగారం నుంచి చింతలపాలెం మండలం కు చెందిన రైతుకు గడ్డిని ట్రాక్టరుపై వేసుకుని గ్రామంలోకి వస్తున్నాడు.గ్రామలోకి రాగానే విద్యుత్ వైర్లు ట్రాక్టర్ ట్రక్కు పై ఉన్న గడ్డికి తాకడంతో మంటలు వ్యాపించి ట్రాక్టరు ట్రక్కుతో సహా వరిగడ్డి దగ్ధమైంది.ఈ విషయాన్ని గ్రహించిన ట్రాక్టర్ డ్రైవర్ చాక చాక్యంగా వ్యవహరించి ఎవరూ లేని ఖాళీ స్థలానికి ట్రాక్టర్ టక్కును తీసుకెళ్లి వదిలేయడంతో వరిగడ్డి ట్రక్కు పూర్తిగా దగ్ధమయ్యాయి,ఇలా చేయటం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.గ్రామంలో ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ప్రమాదంలో రూ.20 వేల విలువైన గడ్డితో పాటు ట్రక్కు దగ్ధమయ్యాయని బా ధితుడు తెలిపాడు.ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో కరెంటు వైర్లు తాకి గతంలో కూడా మూడుసార్లు ట్రాక్టర్లు,వరిగడ్డి కాలిపోయినాయి.ఇది కరెంటు అధికారులకు ఎన్నోసార్లు చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు,అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ అని కూడా ఏపీ స్విచ్ పనిచేయటం లేదు ఏదైనా ప్రమాదం సంభవించిన ఇక్కడ ఆపుకునే విధానం లేకపోవడం వలన సబ్ స్టేషన్ కు ఫోన్ చేసి ఎల్ సి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.విద్యుత్ అధికారులు మాత్రం ఇంటి బిల్లు కట్టకపోయినా,రైతుల మోటార్ల బిల్లులు కట్టకపోయినా మీ విద్యుత్ కనెక్షన్లను తొలగించబడతాయని ప్రకటనలు మాత్రం చేస్తుంటారు.కానీ వారు చేయవలసిన పనులు మాత్రం వారు చేయరు అని గ్రామ ప్రజలు చెప్తున్నారు.