వినాయక మండపాల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 12(ప్రతినిధి మాతంగి సురేష్): గుడిబండ గ్రామ పంచాయతీ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాలు నిర్మిస్తున్న ప్రదేశాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య కమాటీలతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పంచాయతీ సిబ్బందితో కలిసి మండపాల పరిసరాలను శుభ్రం చేయించడం జరిగిందని అన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిరోజు మండపాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కమాటీలు తదితరులు ఉన్నారు.



