మొక్కలతోనే జీవవైద్యం:డా,, వీరేంద్రనాథ్
Mbmtelugunews//ఆత్మకూర్ (ఏస్),ఆగష్టు 09 ప్రతినిధి మాతంగి సురేష్:మొక్కలతోనే జీవవైద్యం మొక్కలు లేకపోతే మానవ మనుగడకు ముప్పు ఉంటదని కందగట్ల వెద్యాధికారి డాక్టర్ బి వీరేందర్ నాథ్,గ్రామ స్పెషల్ ఆఫీసర్ తారాసింగ్ లు అన్నారు.మండల పరిధిలోని కందగట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం ఈ నెల ఆగష్టు 5 వ తారీఖున ప్రాంభించుటం జరిగింది.ఈ కార్యక్రమంలో చివరి రోజులో భాగంగా ఆగష్టు 9 న కందగట్ల గ్రామంలోని ప్రెమరి స్కూల్ నందు కందగట్ల వెద్యాధికారి డాక్టర్ బి వీరేందర్ నాథ్,కందగట్ల గ్రామానికి చెందిన స్పెషల్ ఆఫీసర్ తారాసింగ్ చెట్లు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలను పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు పరిసర ప్రాంతాలను వారి నివసించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే వ్యాధులు రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు అని తెలిపారు మొక్కలు నాటి వాటిని వదిలేయకుండా సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నట్లయితే అవి పెరిగి పెద్దవయి మంచి ఆక్సిజన్ ఇస్తాయని అన్నారు.ఈ మొక్కలు మానవ కోటికి జీవనాధారానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమములో ప్రైమరీ పాఠశాల ప్రిన్సిపల్ రామాంజనేయులు,గ్రామ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి,ఐసిటి గ్రీన్ క్రాస్ కో-ఆర్డినేటర్ రవీందర్,కృష్ణారెడ్డి,ఏఎన్ఎం అరుణ,ఆశాలు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.