సంత అడ్డాలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 15 ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ సంత అడ్డా లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అడ్డ అధ్యక్షులు పర్వతం శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసినారు. ఈ జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో మహానుభావులు,సమరయోధుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్యం ఇది అని అన్నారు.తెల్లదొరల తలలు వంచి.. సాధించిన స్వాతంత్ర్య మువ్వన్నెల రెపరెపల్లో.. కులమతాలకు అతీతంగా పండుగలా సాగాలని అన్నారు.
ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగే రోజు దేశం మొత్తం ఓ పండుగలా జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు (సర్పంచ్)పర్వతం శ్రీను,ప్రాదన కార్యదర్శి గోపరాజు,కోశాధికారి వి రాజు,యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.