ఆర్ధిక సహాయం అందజేత
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 15 ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండల పరిధిలోని పాత కొండాపురం గ్రామానికి చెందిన మేరిగ గురువయ్య ఇటీవల గ్యాస్ పేలి మృతి చెందినాడు.విషయం తెలుసుకున్న బిఎస్ఎన్ఎల్ టాక్సీ స్టాండ్ డ్రైవర్లు 10000 ఆర్థిక సహాయం శ్రీనివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు గరిడేపల్లి రమేష్ మాట్లాడుతూ తోటి డ్రైవర్ కు అన్ని విధములుగా అందుబాటులో ఉంటు ఆదుకుంటామని తెలిపారు.వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గుండపునేని నవీన్,చాపల శీను,రెడ్డబోయిన ప్రశాంత్,అశోక్,వాసు,నరసయ్య,రాంబాబు,సాగర్,డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.