జాతీయ సేవా దినోత్సవం
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 24(మనం న్యూస్):స్థానిక కెఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవపథకం (ఎన్ఎస్ఎస్) మూడు యూనిట్లు ఎన్ఎస్ఎస్ డే వేడుకలు నిర్వహించారు.జాతిపిత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 1969 సెప్టెంబర్ 24 న పాఠశాలలు,కళాశాలల్లో ప్రారంభించిన జాతీయ సేవాపథకంలో భాగంగా సమాజ సేవలో యువత భాగస్వామ్యం అవ్వాలనె ఆలోచనలనుండి వచ్చిన బృహత్తరమైన కార్యక్రమం ఎన్ఎస్ఎస్. కళాశాల ప్రిన్సిపాల్ డా,,చందా అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ,కష్టపడేతత్వం ఉండాలని విపత్తులు సంభవించినప్పుడు సామాజిక సేవ అవసరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ వి శ్రీలత,డా,,ఎన్ నిర్మల కుమారి,వి వెంకటేశ్వర రెడ్డి,కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఫ్రాన్సిస్,అధ్యాపకులు సైదులు,సైదమ్మ,రాజు,శ్రీలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
Pls subscribe MBM TELUGU NEWS my youtube chanal tq