Sunday, August 9, 2026
[t4b-ticker]

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

:పేదల జీవితాలలో వెలుగులు నింపిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

:కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి

కోదాడ, ఆగష్టు 09(ప్రతినిధి మాతంగి సురేష్): 10 సంవత్సరాల పేదల కలను నెరవేర్చిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అని 19 వార్డు కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి అన్నారు. కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో శాసన సభ్యురాలు ఎన్ పద్మావతి రెడ్డి చేతుల మీదుగా 19వ వార్డులోని నిరుపేదలైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు పట్టాలు ఇప్పించి వారి గృహము వద్దకు వెళ్లి వారికి వారి యొక్క డబల్ బెడ్ రూమ్ ఇల్లును ప్రతి ఒక్కరికి అప్పజెప్పడం జరిగిందని కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి తెలిపారు

.19వ వార్డులో నిరుపేదలైన వారికి 9 డబల్ బెడ్ రూమ్ ఇల్లులు పట్టాలిచ్చి వారికి గృహములు అందజేయించిన ఎమ్మెల్యేకి, అధికారులు ఆర్డీవోకి, తాసిల్దారుకి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోటు రంగారావు, ముండ్ర రామారావు, తమనబోయిన వీరబాబు, కొనుగొండ్ల వీరారెడ్డి, నలజాల శ్రీనివాసరావు, కోటమర్తి విద్యాసాగర్, కలుగోట్ల బ్రహ్మారెడ్డి, షేక్ ఖాదర్, లబ్ధిదారులు, 19 వ వార్డు పెద్దలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular