నూతనంగా పెన్షన్లకు అప్లై చేసుకున్న లబ్ధిదారుల ఎంక్వయిరీ చేస్తున్న అధికారులు.
:నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పథకాలు తప్పక అందుతాయి.
:సర్పంచి గువ్వల శిరీష వెంకట్.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పథకాలు తప్పక అందుతాయని సర్పంచి గువ్వల శిరీష వెంకట అన్నారు. మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో నూతనంగా పెన్షన్లకు అప్లై చేసుకున్న లబ్ధిదారుల ఎంక్వయిరీ ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా పెన్షన్లకు అప్లై చేసుకున్న లబ్ధిదారులకు తప్పక పెన్షన్లు వస్తాయని ఉన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంక్వయిరీ అధికారులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



