క్రిస్టియన్ మైనార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ 42వ వర్ధంతి
:కన్నీరు పెట్టుకున్న మాజీ కో ఆప్షన్ సభ్యులు వంటెపాక జానకి యేసయ్య.
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 31(ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణంలో క్రిస్టియన్ మైనార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 42వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ క్రిస్టియన్ కో-ఆప్షన్ సభ్యులు వంటేపాక జానకి యేసయ్య హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జానకి యేసయ్య మాట్లాడుతూ, ఇందిరాగాంధీ పేదల కోసం చేసిన మేలులు, లేనివారికి ఇల్లు ఇవ్వడం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం వంటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబ నేపథ్యాన్ని, ఇందిరాగాంధీ హయాంలో తమకు జరిగిన మేలును స్మరించుకుంటూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ ప్రెసిడెంట్ కే రామారావు, కోదాడ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుదాస్, అనంతగిరి మండల ప్రెసిడెంట్ ఇ రాజేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంపాటి పుల్లయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు కుడుముల రాంబాబు, శామ్యూల్, కిరణ్, చల్మయ్య, నందిగామ రవి తదితరులు పాల్గొన్నారు.



