రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికైన ఎస్సార్ఎం విద్యార్థి
: షార్ట్ ఫుట్ లో జిల్లా ప్రథమ స్థానం సాధించిన నందిరెడ్డి అనీష్ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 31(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్జిఎఫ్ అండర్ 14 జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలలో ఎస్ఆర్ఎం సంకల్ప 9వ తరగతి విద్యార్థి నందిరెడ్డి అనీష్ రెడ్డి ప్రతిభ చాటాడు. షార్ట్ ఫుడ్ లో 10.5 మీటర్లు దూరం విసిరి జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించి నవంబర్ నెలలో హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంతో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థినికి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి పూల బొకేతో విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



