ఉత్తమ్ పద్మావతి ప్రీమియర్ లీగ్ – 2026
:జాతీయ స్థాయి టెన్నిస్ బాల్, క్రికెట్ టోర్నమెంట్‌కు ఏర్పాట్లు పూర్తి.
:బ్రోచర్ ను ప్రారంభించిన చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 10(ప్రతినిధి మాతంగి సురేష్): యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ్ పద్మావతి ప్రీమియర్ లీగ్ – 2026 జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను నడిగూడెం మండల కేంద్రంలో ఎస్కేపి జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన బ్రోచర్ ను పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి నివాసంలో ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌ను 2026 అక్టోబర్ 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన జట్లకు నిర్వాహకులు భారీ నగదు బహుమతులను ప్రకటించారు.ప్రథమ బహుమతి: రూ.50,000, ద్వితీయ బహుమతి: రూ.25,000, తృతీయ బహుమతి: రూ.15,000, వ్యక్తిగత ప్రతిభా పురస్కారాలు: ఎంపిక చేసిన విభాగాల్లో ఒక్కో అవార్డుకు రూ.3,016 చొప్పున. బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ యంగ్ టాలెంట్, బెస్ట్ ఫీల్డర్ తదితర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు వ్యక్తిగత పురస్కారాలు అందించనున్నారు.
యువ క్రీడాకారులకు మంచి అవకాశం
క్రికెట్‌పై ఆసక్తి ఉన్న యువత తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ లీగ్ మంచి వేదికగా నిలవనుంది. క్రీడాకారుల్లో క్రమశిక్షణ, జట్టుగా ఆడే తత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు గ్రామీణ క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం అందించడమే ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాలకు సంప్రదించండి 9559535439, 9705169148, 9573117085 లను సంప్రదించగలరు



