రాష్ట్రస్థాయి కబడ్డీకి సూర్యాపేట జట్టు ఎంపిక.
:7న కోదాడలో సెలక్షన్స్.
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 05 (ప్రతినిధి మాతంగి సురేష్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఈ నెల 10 నుంచి 12 వరకు జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు అల్లం ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నామా నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్టు ఎంపికలను అక్టోబర్ 7న మధ్యాహ్నం 3 గంటలకు కోదాడ పట్టణంలోని భవానీనగర్ లో ఉన్న ఎస్వి కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారిణులు తప్పనిసరిగా తమ వెంట ఎస్ఎస్సి మెమో, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. క్రీడాకారిణులు 20 సంవత్సరాల లోపు వయసు కలిగి, 65 కిలోల లోపు బరువు ఉండాలని తెలిపారు. జిల్లాలోని అర్హత కలిగిన జూనియర్ బాలికల కబడ్డీ క్రీడాకారిణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.



