సమతుల్య ఆహారం, పోషక విలువలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన
:గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలి
: సర్పంచి పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 05(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని దోరకుంటలో పోషణ్ అభియాన్ కార్యక్రమం గ్రామ పంచాయతీ పరిధిలో పోషణ్ అభియాన్లో భాగంగా పోషకాహారంపై అవగాహన కార్యక్రమముని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గ్రామ సర్పంచి పాలికి సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య ఆహారం, పోషక విలువలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.పోషకాహార లోపాన్ని నివారించేందుకు స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, పండ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. చిన్నారుల ఎదుగుదల, బరువు, ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని తెలిపారు.గ్రామస్థాయిలో పోషణపై అవగాహన పెంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం సులోచన, అంగన్వాడీ టీచర్స్ కృష్ణవేణి, నాగమణి, ఆదిలక్ష్మి, అరుణ, ఆశా కార్యకర్తలు ఎల్లమ్మ, అరుణ, వార్డ్ మెంబర్ కోనపర్తి తిరుమల చారి, గర్భిణీలు, బాలింతలు, పాల్గొన్నారు.



