Thursday, October 1, 2026
[t4b-ticker]

ప్రతి నీటి చుక్కా భవిష్యత్తుకు బాట.

ప్రతి నీటి చుక్కా భవిష్యత్తుకు బాట.

:జల సంరక్షణపై కోదాడలో విద్యార్థుల అవగాహన ర్యాలీ.

:నీటి పొదుపు, పునర్వినియోగానికి పిలుపు.

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 01 (ప్రతినిధి మాతంగి సురేష్) : జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు నీటి వృథాను అరికట్టాలనే సందేశంతో కోదాడ పట్టణంలో గురువారం పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యంగ్ ఎర్త్ లీడర్స్ శివ, చెంచులక్ష్మి, నాగేందర్, కుమార్, అభిరాం, నేహా, వీర కుమారి, శ్యామ్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఆదేశానుసారం భారీ పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.జల సంరక్షణ మన భవిష్యత్తు రక్షణ, ట్యాప్‌ కట్టేద్దాం, నీటిని వృథా చేయవద్దు, నీటిని మళ్లీ వాడదాం వంటి నినాదాలతో విద్యార్థులు పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి చుక్క నీటిని పొదుపుగా వినియోగించాలని, అవసరానికి మించి నీటిని వృథా చేయకూడదని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలని విద్యార్థులు సూచించారు. ఇళ్లలో, పాఠశాలల్లో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు సాధ్యమైన చోట నీటిని పునర్వినియోగించుకోవాలని వివరించారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించుకోవచ్చని తెలిపారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చేయాలంటే ప్రస్తుత తరమే బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా జల సంరక్షణ, ప్లాస్టిక్‌ నివారణ, మొక్కల పెంపకం, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఎల్ప్ కార్యక్రమాల ద్వారా చర్యలు చేపడుతున్నట్లు సీనియర్ ఉపాధ్యాయులు, మెంటర్ టీచర్ బడుగుల సైదులు తెలిపారు. విద్యార్థుల చేతుల్లో అవగాహన నినాదాలు, ప్లకార్డులు దర్శనమివ్వగా.. ర్యాలీ ఆద్యంతం పర్యావరణ పరిరక్షణ సందేశాలతో కోదాడ పట్టణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో వి శ్రీనివాసరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ, ఉపాధ్యాయులు డి లింగయ్య, ఎం వీర బ్రహ్మచారి, ఎస్ కె కాజా మియా, మనోహర్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular