Thursday, October 1, 2026
[t4b-ticker]

రక్తదానం మరొకరి ప్రాణాలు కాపాడుతుంది : డా,, వీరేంద్రనాథ్

రక్తదానం మరొకరి ప్రాణాలు కాపాడుతుంది : డా,, వీరేంద్రనాథ్

Mbmtelugunews//ఆత్మకూర్ యస్, అక్టోబర్ 01(ప్రతినిధి మతం సురేష్) : దాతలు రక్తదానం చేయటం వలన మరొకరి ప్రాణాలు కాపాడవచ్చు అని స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని వైద్యాధికారి బంకా వీరేందర్ నాథ్ పిలుపునిచ్చారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు యస్ మండల పరిధిలోని కందగట్ల ప్రభుత్వ హాస్పిటల్లో గ్రామస్తుల చే ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రక్తదానం చేసినట్లయితే వారి ప్రాణాలను కాపాడవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం కృత్రిమంగా తయారు చేయలేం కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం వలన ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందికి పునర్జీవం ఇవ్వవచ్చని దాతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కందగట్ల గ్రామ సర్పంచి శిగ నాగమణి, శ్రీనివాస్ గౌడ్, ఆశాలు సుజాత, లలిత, విజయ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular