Saturday, October 3, 2026
[t4b-ticker]

మహిళా డాక్టర్ పై దాడి హేయమైన చర్య.

మహిళా డాక్టర్ పై దాడి హేయమైన చర్య.

:బాధ్యులను కఠినంగా శిక్షించాలి.

:యాతాకుల మధుబాబు, తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు.

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 03(ప్రతినిధి మాతంగి సురేష్): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలుపై మరియు ఇతర సిబ్బందిపై జరిగిన దాడిని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు యాతాకులు మధుబాబు తీవ్రంగా ఖండించారు,). ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులకు, ఆరోగ్య సిబ్బందిపై విధి నిర్వహణలో ఉండగానే ఇటువంటి దాడులు జరగడం అత్యంత ఆందోళనమని అన్నారు. రోగులకు నిరంతరం ప్రాణ రక్షణ కోసం తాపాత్రబడుతూ ప్రాణాలు కాపాడే వైద్యులపై దాడి చేయడం అంటే ప్రజారోగ్యంపైనే దాడి చేయడం అని ఇటువంటి దాడులు చేసిన వారిపై క్రిమినల్ చర్యలను తీసుకోవాలని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ కల్పిస్తూ సురక్షితంగా వైద్య సేవలు అందించే అవకాశం కల్పించాలని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పురాతం కాకుండా ప్రభుత్వం నిందితుడిపై తగు చర్యల్ని తీసుకోవాలని కోరారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular