Saturday, November 14, 2026
[t4b-ticker]

బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Mbmtelugunews//కోదాడ, నవంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక నయానగర్‌లోని బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవ మాజీ కోఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి యేసయ్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 14న నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ తొలి ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రాధాన్యతను, వారి భవిష్యత్తు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ కోర్ కమిటీ చైర్మన్ వి యేసయ్య, అనంతగిరి పాస్టర్స్ ఫెలోషిప్ మండల అధ్యక్షులు ఈ రాజేష్, కోదాడ పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ల ప్రభుదాస్, కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular