ఎంబీబీఎస్ సీటు సాధించిన వేరోనికాకు సత్కారం.
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): నీట్ పరీక్షలో జాతీయ స్థాయి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ లో ప్రభుత్వ సీటు పొందిన చిరంజీవి వేరోనికాను సంఘం తరఫున ఘనంగా సన్మానించారు. నడిగూడెం మండలం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు కుమార్తె అయిన వేరోనికా నీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ ర్యాంకు సాధించడం పట్ల సంఘ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాస్టర్, వారియర్స్ బృందం కలిసి వేరోనికాను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.అనంతరం పాస్టర్ గ యేసయ్య మాట్లాడుతూ, వేరోనికాను ఆదర్శంగా తీసుకుని సంఘంలోని యువతీ యువకులంతా బాగా చదువుకొని, వారి వారి రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.రాబోయే కాలంలో వేరోనికా గొప్ప డాక్టర్ గా పేరు తెచ్చుకోవాలని, సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తూ పాస్టర్ ప్రత్యేక ప్రార్థన చేసి ఆమెను దీవించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యువత, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



