దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి……
అన్నదానాలు పుణ్య కార్యాలు…….
:మహా అన్నదానం ప్రారంభించిన కౌన్సిలర్ కోటిరెడ్డి
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని 19 వార్డు కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అన్ని వేళలా అందిస్తానని, భక్తి భావంతో నిర్వహించే పూజా కార్యక్రమాలు, అన్నదానాలు సమాజంలో ఐక్యతను, సేవా భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అన్నదానం మహోన్నతమైన పుణ్యకార్యమని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని పేర్కొన్నారు.
ఆదివారం కోదాడ పట్టణంలోని భవానినగర్ వినాయక గుడి వెనక గ్రౌండ్ లో దుర్గా మాత విగ్రహం వద్ద స్థానిక కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. పండుగలు, ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భక్తిశ్రద్ధలతో దుర్గా మాతను ఆరాధిస్తూ ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రత్యేక గుర్తింపు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.



