Sunday, October 18, 2026
[t4b-ticker]

పేదలకు నూతన వస్త్రాల పంపిణీ

పేదలకు నూతన వస్త్రాల పంపిణీ

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్): అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ నయానగర్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో పేదలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. మున్సిపాలిటీ మాజీ క్రిస్టియన్ కో-ఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి యేసయ్య ఆధ్వర్యంలో కొంతమంది నిరుపేదలకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, పేదరిక నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా పేదలకు సహాయం చేయాలని, పేదలను ఆదుకోవడమే నిజమైన దైవ సేవ అని పేర్కొన్నారు.

Oplus_16908288

పేదల పట్ల ప్రేమ, సహాయం చూపడం ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ నాయకులు పాస్టర్ యేసయ్య, పాస్టర్ కర్ల ప్రభుదాస్, డేవిడ్ రాజారావు, పాస్టర్ రాజారావు, పాస్టర్ కాపుగంటి ప్రసాదరావు, పాస్టర్ చెల్మయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular