పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలి
Mbmtelugunews//నడిగూడెం, అక్టోబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్):ఉమ్మడి నల్లగొండ – ఖమ్మం – వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో భాగంగా నడిగూడెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండు మహేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు పగిళ్ల ఉపేందర్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిదిలోని కేశవాపురం గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులకు గ్రామంలోనే అర్హులైన పట్టబద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడానికి ఓటర్ నమోదు ప్రక్రియ ఎంతో ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గోసుల రాజేష్, ఉప సర్పంచి పుల్లయ్య, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శివరాత్రి ఉపేందర్, వార్డ్ మెంబెర్స్ ఉపేందర్, కరుణాచారి, మనోజ్, గ్రామ నాయకులు అర్జున్ రావు, గోవర్ధన్, గోపీనాథ్, ఫెరెల్లి గోపయ్య, మొక్క శ్రీను, ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ గ్రామ కమిటీ,మండల కమిటీ, యువజన నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



