Tuesday, October 6, 2026
[t4b-ticker]

నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి

నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి

:ఖాళీగా ఉన్న పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి.

:గ్రంథాలయంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై మెటీరియల్ పంపిణీ చేసిన ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్.

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 05(ప్రతినిధి మాతంగి సురేష్) : నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న కొలువులను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. కోదాడ పట్టణ పరిధిలోని గ్రంథాలయంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు యూనిక్, ఐరైజ్ ప్రముఖ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన మెటీరియల్ ను ఉచితంగా శ్రీకాంత్ యాదవ్ పంపిణీ చేశారు.

Oplus_19005440

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనీ ప్రభుత్వాలకు తగిన గుణపాటాలు చెప్పిన సంగతి విధితమే ఈ ప్రభుత్వం కూడా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కొలువులను తక్షణమే భర్తీ చేయాలని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అలాంటి నిరుద్యోగులను ఓటు బ్యాంకుగా వాడుకొని వారిపై సవతి తల్లి ప్రేమ చూపించడం అది సరైనది కాదని అన్నారు. గ్రంథాలయంలో చదువుతున్న నిరుద్యోగ యువతకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వము, ప్రజాపతినిధులు పూర్తిగా విఫలం చెందారని అన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల కిట్టు, ఉదయ్ యాదవ్, పందిటి నవీన్, రాజేష్, ప్రసన్నకుమార్, శ్రీ వాస్తవ్, నిరుద్యోగ యువతీ, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular