నిరుద్యోగ సమస్య పరిష్కారమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల దయ.
:జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి.
:కోదాడ మెగా జాబ్ మేళా పోస్టర్ల ఆవిష్కరణ చేసిన చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిల ఆధ్వర్యంలో కోదాడలోని 19వ తారీఖున శనివారం సిసి రెడ్డి స్కూల్ నందు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిలు కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో సంక్షేమం అభివృద్ధితోపాటు నిరుద్యోగ సమస్య పరిష్కారమే మంత్రి ఎమ్మెల్యేల ధ్యేయం అని అన్ని వర్గాలకు మేలు మంత్రి, ఎమ్మెల్యేల తోనే సాధ్యమవుతుందన్నారు .ఈ జాబ్ మేళాలో సుమారు 300 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని పేర్కొన్నారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చింతకుంట్ల సూర్యం, తమనబోయిన వీరబాబు, మల్లు వెంకటరెడ్డి, మణెమ్మ, వెంకటేశ్వర్లు, అభిరామ్, వేణు, అమర్ సింగ్, నర్సిరెడ్డి, శ్రీనివాస్, శ్రీను సిబ్బంది తదితరులు ఉన్నారు.



