Friday, September 18, 2026
[t4b-ticker]

జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.

జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.

:రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తప్పక హాజరు కావాలి.

:రిజిస్ట్రేషన్ చేసుకుని వారు వస్తే ఆ రోజే రిజిస్ట్రేషన్ చేసి కంపెనీకి అటాచ్ చేస్తారు.

:మెగా కార్పొరేట్ జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.

:టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్) : ఈనెల 19న కోదాడలో సీసీ రెడ్డి కాన్వెంట్ లో నిరుద్యోగ యువత కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అధ్యక్షతన నిర్వహించబడుతున్న మెగా కార్పొరేట్ జాబ్ మేళాకు రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగ యువతీ, యువకులు తప్పక హాజరుకావాలని టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో నిరుద్యోగ సమస్యను అధిగమించాలంటే నిరుద్యోగులకు జాబ్ మేళా లు ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళాకు ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా నుండి ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నట్లు తెలిపారు. చాలామంది నిరుద్యోగ యువత వేలకు వేలు ఖర్చుపెట్టి కోచింగ్ లు తీసుకొని ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఖర్చు లేకుండా కంపెనీలనే నిరుద్యోగుల వద్దకు తీసుకురావాలనే సంకల్పంతో మంత్రి, ఎమ్మెల్యే ఎనలేని కృషిచేసి సుమారు 300 కంపెనీలను కోదాడకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. కావున కోదాడ నియోజకవర్గ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకొవాలని అన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారు 19వ తారీఖు నాడు సిసి రెడ్డి కాన్వెంట్ కు వస్తే వారి రిజిస్ట్రేషన్ చేసి వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular