Friday, September 18, 2026
[t4b-ticker]

అన్నదానం… మహాదానం.

అన్నదానం… మహాదానం.

:గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి.

:గణనాధునిదయతో ప్రజల విజ్ఞతలు తొలగిపోవాలి.

:అన్నదానాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం.

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్) : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవాలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం అన్నారు. పట్టణ పరిధిలోని 28వ వార్డు ఆజాద్ నగర్ లో విద్యానగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆజాద్ నగర్ లో విద్యానగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మంటపంలో పూజ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పట్టణ ప్రజలు వినాయకుని దయ వలన విజ్ఞతలు తొలగి ఆ యురారోగ్యాలతో, సుఖసంతో షాలతో ఉండాలని, పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండి అభివృద్ధి చెందాలని మహాగణపతిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ తోట జ్యోతి శ్రీనివాస్, మారిశెట్టి ధనమ్మ నారపరెడ్డి, గురజాల నాగేశ్వరరావు, షేక్ ఉస్మాన్, పులి బ్రహ్మం, మారిశెట్టి నరసింహారావు, బుక్క శ్రీనివాసరావు, కంకణాల మనిషా, తోట ఉపేందర్, భూతం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular