టీచర్స్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
మూడవరోజు ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 16:(ప్రతినిధి మాతంగి సురేష్):టీచర్స్ కాలనీలో నిర్వహిస్తున్న శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజు బుధవారం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దర్శనం చేసుకున్నారు.కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో గణేష్ మహారాజుకు పుష్పాలు, పండ్లు, నైవేద్యాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం పూజారులు వేద మంత్రాలతో గణపతి పూజలు నిర్వహించగా, భక్తులు కోలాహలంగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 22 వరకు నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.



