రామలక్ష్మీపురంలో ఘనంగా ముత్యాలమ్మ పండగ
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 03(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామంలో ముత్యాలమ్మ పండగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పండగ సందర్భంగా గ్రామస్తులు అమ్మవారికి, బుడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
సాంప్రదాయంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పొట్టేళ్లను అమ్మవారికి బలి ఇచ్చి భక్తిశ్రద్ధలతో పూజించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దలు, ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొని పండగ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలో సుఖశాంతులు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ముత్యాలమ్మ పండగతో రామలక్ష్మీపురంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దకాపు కొప్పుల శంబిరెడ్డి, చిన్న కాపు అన్నెం వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచి తులశమ్మ కన్నారెడ్డి, ఉపసర్పంచి బెల్లంకొండ సీతారాములు, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అన్నెం అంజిరెడ్డి, మాజీ సర్పంచి బెల్లంకొండ బ్రహ్మం, ఉపసర్పంచి మాజీ అన్నెం వెంకటరెడ్డి, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మీసాల నాగరాజు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



