కొత్తగూడెంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
:మహిళలకు గ్రామ యువత ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం
Mbmtelugunews//అనంతగిరి, అక్టోబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరధిలోని కొత్తగూడెం గ్రామంలో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు, యువతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామ యువత ఆధ్వర్యంలో వారికి బహుమతులను అందజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ కలిసి ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని యువత పేర్కొన్నారు.

గ్రామంలో ఐకమత్యం, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు తెలిపారు. బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసిన మహిళలు, యువతులు, గ్రామ ప్రజలకు గ్రామ యువత సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలకు బహుమతులు అందజేసిన వారిలో కలకుంట్ల వీరయ్య, బట్టు గోపీకృష్ణ, గౌతమ్, బట్టు గోపి, మధు, బట్టు ఉదయ్ కిరణ్, కలకుంట్ల సురేష్, సునీల్ గోపి తదితరులు పాల్గొన్నారు.



