దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి……
:ప్రత్యేక పూజలు నిర్వహించిన కామిశెట్టి వెంకటేశ్వర్లు విజయనిర్మల దంపతులు
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్): దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని లాయర్ కామిశెట్టి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. మండల పరిధిలోని గణపవరం గ్రామంలో పొట్టి శ్రీరాములు సెంటర్లో ఏర్పాటుచేసిన కనకదుర్గ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కామిశెట్టి వెంకటేశ్వర్లు విజయనిర్మల దంపతులు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అన్ని వేళలా అందిస్తానని, భక్తి భావంతో నిర్వహించే పూజా కార్యక్రమాలు, సమాజంలో ఐక్యతను, సేవా భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పండుగలు, ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భక్తిశ్రద్ధలతో దుర్గా మాతను ఆరాధిస్తూ ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.



