తెలంగాణ మట్టపల్లి,ఏపీ తంగెడ గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలి
:జై భీమ్ రాష్ట్ర అధ్యక్షులు పోతుల వెంకటేశ్వర్లు
Mbmtelugunews//ఆంధ్రప్రదేశ్,అక్టోబర్ 31(ప్రతినిధి మాతంగి సురేష్): రెండు రాష్ట్రాలు అయినా తెలంగాణలో సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలం, మట్టపల్లి గ్రామం, ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామం ఈ రెండు రాష్ట్రాలు కలిపి మట్టపల్లి లక్ష్మీనరసింహ వారధి కట్టి ఏడు సంవత్సరములు అయినది. అయినా ఇంతవరకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంలో రెండు రాష్ట్రాలు విఫలం చెందాయనిజై భీమ్ రాష్ట్ర అధ్యక్షులు పోతుల వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు రాష్ట్రాల ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టిసి నుండి ఎటువంటి బస్సు సౌకర్యం కల్పించడంలో పూర్తిగా సంబంధిత అధికారులు విఫలం చెందారు.

ప్రజలు మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి రావాలంటే అలాగే హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఏదైనా అవసరాల నిమిత్తం పలనాడు జిల్లాకు రావాలంటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రాణభయముతో ఆటోలు, మినీ ట్రక్కులు, లారీలు పట్టుకొని గమ్యానికి ప్రయాణిస్తున్నారని అన్నారు. రెండు రాష్ట్రాల ఆర్టిసి ఎండీలు ప్రజలకు మెరుగైన బస్సు సౌకర్యం l ప్రజలకు సుఖమంతమైన ప్రయాణం కల్పించాల్సిన బాధ్యత ఇరువురు పై ఉన్నదని అన్నారు. ఈ రెండు రాష్ట్రాలకు బస్సు సౌకర్యం కల్పించడానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ప్రజల సురక్షిత ప్రయాణానికి బస్సు సౌకర్యాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయాలని అన్నారు. హుజూర్ నగర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు లు చొరవ తీసుకొని ఈ రెండు రాష్ట్రాల వారధి నుండి బస్సులు నడిచేలా తక చర్యలు తీసుకోవాలని అన్నారు. పల్నాడు జిల్లా నుండి పిడుగురాళ్ల డిపో నుండి పెనుగంచిప్రోలు, భద్రాచలం, యాదగిరిగుట్టకు, దాచేపల్లి నుండి పిడుగురాళ్ల నుండి మాచర్ల నుండి కోదాడ, ఖమ్మం, జగ్గయ్యపేట, హుజూర్ నగర్, సూర్యాపేట బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు.



