గుడిబండలో సీసీ డ్రెయిన్ ప్రారంభం
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 05(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ వార్డులో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులను గ్రామ సర్పంచి మందుల నాగయ్య, గ్రామ కార్యదర్శి అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జయసింహా రెడ్డి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇర్లా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



