Thursday, October 1, 2026
[t4b-ticker]

సేవా సేతువు అభియాన్ – పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన

సేవా సేతువు అభియాన్ – పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన

:సోలార్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.

:డిఈ రామ్మోహన్ రెడ్డి

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్): కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సేవా సేతువు అభియాన్ కార్యక్రమంలో భాగంగా 02-10-2026 నుండి 04-10-2026 వరకు కోదాడ మండల కేంద్రంలోని కేంద్రంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నట్లు జి రామ్మోహన్ రెడ్డి, డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్), హుజూర్నగర్ మరియు ఎం వెంకన్న ఏడీఈ కోదాడ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధించిన వివరాలు, అర్హతలు, సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ తదితర అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించనున్నారు. కావున హుజూర్నగర్ మరియు కోదాడ నియోజకవర్గంలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద లభించే సబ్సిడీ ప్రయోజనాలను పొందాలని వారు కోరారు, ఇట్టి సదస్సులో బ్యాంకు సిబ్బంది ,రెడ్కో శాఖ సిబ్బంది మరియు సోలార్ ప్యానెల్ డిస్ట్రిబ్యూటర్ లు కూడా పాల్గొంటారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular