Saturday, September 19, 2026
[t4b-ticker]

రెండు రోజులుగా అంధకారంలో ఒకటో వార్డు ప్రజలు.

రెండు రోజులుగా అంధకారంలో ఒకటో వార్డు ప్రజలు.

:గతంలో కూడా ఎన్నోసార్లు ఇలా జరిగినది.

:పట్టించుకోని అధికారుల.

Mbmtelugunews//అనంతగిరి, సెప్టెంబర్ 19 (ప్రతినిధి మాతంగి సురేష్):
గత రెండు రోజులుగా విద్యుత్ లేక అంధకారంలో ఉంటున్నట్లు ఒకటవ వార్డు ప్రజలు పట్టించుకోని అధికారులు.
మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలోని 1వ వార్డులో ప్రైవేటు స్థలంలో విపరీతంగా పెరిగిన చెట్లు విద్యుత్ తీగలకు ఉరితాళ్లుగా మారాయి. తీగలను తాకుతూ,అల్లుకుపోయిన కొమ్మల కారణంగా ప్రతిరోజూ షార్ట్ సర్క్యూట్ అయ్యి నిప్పురవ్వలు పడి గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వార్డు ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. గాలి వీచితే చాలు తీగలు తెగి ఇళ్లపై పడే ప్రమాదం ఉందని,ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్రాణ భయంతో 1వ వార్డు ప్రజలు భయంతో వణికిపోతున్నారు.రాత్రిళ్లు చిన్న పిల్లలు,వృద్ధులు ఉక్కపోతతో అంధకారంలో మగ్గుతున్నారు.విద్యుత్ శాఖ అధికారులు మాత్రం చెట్ల తొలగింపునకు సిద్ధంగా ఉన్నామని, స్థల యజమాని అనుమతి ఇస్తే చాలు వెంటనే జెసిబితో తొలగించి శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. అయినా స్థల యజమాని ఇప్పటి వరకు స్పందించకపోవడం పట్ల వార్డు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థల యజమాని మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి చెట్ల తొలగింపునకు సహకరించాలని, లేని పక్షంలో అధికారులే చర్యలు తీసుకొని గ్రామస్తుల ప్రాణాలను కాపాడాలని 1వ వార్డు వాసులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular