నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం కోదాడ మెగా జాబ్ మేళా
:యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
:నేడే కోదాడలో జాబ్ మేళా…
:యాతాకుల జ్యోతి మధుబాబు మాజీ ఎంపీపీ నడిగూడెం.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడలో నేడు 19వ తారీఖు న నిర్వహించే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని, ఇటువంటి మహత్తర అవకాశాన్ని కోదాడ నియోజకవర్గంలో నిర్వహించటం నిరుద్యోగుల పాలిటి ఓ వరం అని ఈ అవకాశాన్ని కల్పించిన కోదాడ శాసనసభ్యులు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధ్యక్షతన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యములో దాదాపు 300 కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి కోదాడ సిసిరెడ్డి కాన్వెంట్ నందు నేడు19వ తారీఖు న నిర్వహిస్తున్నందున ఈ మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు, ఆన్లైన్ నందు రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగులు అందరూ 19 వ తారీఖు నాడు ఇంటర్వ్యూలు అటెండ్ కావాలని కోరారు, ఉద్యోగం కోసం కంపెనీల చుట్టూ తిరిగే పరిస్థితి నుండి కంపెనీలనే నిరుద్యోగుల వరకు తీసుకొస్తున్నటువంటి పద్మావతి రెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి కృషి అభినందనీయమని వారు ఈ ప్రాంత ప్రజల పాలిట ఆపద్బాంధవులు గా చరిత్రలో నిలిచిపోతారని స్కిల్ ఉండి ఎలా ఉద్యోగం సంపాదించాలో అర్థం కాని యువకులకు వారి చెంతకి కంపెనీలు రావడం చరిత్రలో అద్భుతమైనదని గత సంవత్సరం హుజూర్ నగర్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయని నేడు నిర్వహించబోయే మెగా జాబ్ మేళా నందు అన్ని వసతులతో ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వేల మందికి అవకాశాలకు ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయని ఈ ప్రాంత ప్రజల విద్యార్థుల తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం నింపడానికి ఒక గొప్ప వేదికను అందిస్తూ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల పాత్రను మంత్రివర్యులు, శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి లకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జిల్లా ప్రజలు తెలుపుతున్నారని అన్నారు.



