వేణుగోపాలస్వామి దేవాలయ భూముల కౌలు వేలం పాట
Mbmtelugunews//కోదాడ, జూన్ 17(ప్రతినిధి మాతంగి సురేష్) :శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం భూముల కౌలు బహిరంగ వేలం పాటను బుధవారం మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలోని దేవాలయ ప్రాంగణంలో 2026-27 సంవత్సరమునకు కౌలు పాటలు దేవాలయ చైర్ పర్సన్ పైడిమర్రి సరస్వతి మదన్ మోహన్ రావు గ్రామ పెద్దలు, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలంపాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో కౌలు రైతులు సర్వే నెం. 121 మూడు ఎకరాల 30 కుంటలు వంక అప్పారావు 98 వేల రూపాయలకు పాట పాడి వేలం దక్కించుకున్నారు. 121వ సర్వేనెంబర్ 5 ఎకరాలు భూమిని రెండు లక్షల పదహారువేల రూపాయలకకు భూమిని రెండు లక్షలు 16 వేల రూపాయలకు కొల్లు సులోచన రావు వేలం పాట పాడి దక్కించుకున్నారు, సర్వేనెంబర్ 23 లో ఎకరం 30 కుంటల భూమిని 16 వేల రూపాయలకు వంకా సీతారామయ్య పాట పాడి వేలం దక్కించుకున్నారు, 25వ సర్వే నెంబర్లు ఎకరాలు 8కుంటల భూమిని కొల్లు సులోచనరావు 4 లక్షల 15 వేల రూపాయలకు వేలం పాట పాడి పాటు దక్కించుకున్నారు. అనంతరం దేవాలయ అర్చకులు గ్రామ ప్రజలకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ కార్యనిర్వహణ అధికారి తుమ్మల వెంకట చలపతి, మేళ్లచెరువు శివాలయ కార్య నిర్వహణ అధికారి శంబిరెడ్డి, తొగర్రాయి గ్రామ సర్పంచి లిక్కి గురవమ్మ వెంకటయ్య, ఉపసర్పంచి ఉమామహేశ్వరి శ్రీనివాసరావు, వార్డు నెంబర్లు వీరయ్య గౌడ్, గ్రామ పెద్దలు పోతరాజు నరసయ్య, బాలేబోయిన పెద్ద యాలాద్రి, నాగరాజు, ఉపేందర్, అప్పారావు, నారాయణ, గ్రామ రైతులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.



