Thursday, October 1, 2026
[t4b-ticker]

జలశిరి కార్యక్రమం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.

జలశిరి కార్యక్రమం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.

:ప్రతి ఇంట్లో ఇంకుడు గుంట తప్పనిసరి.

:నీటిని పొదుపుగా వాడి భావితరాలకు నీరును అందిద్దాం.

: సర్పంచి మందుల నాగయ్య

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్): నీటిని పొదుపుగా వాడి భావితరాలకు నీరును అందిద్దాం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీయాలని గ్రామ సర్పంచి మందుల నాగయ్య అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామ పంచాయతీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలశిరి కార్యక్రమంలో భాగంగా బోర్‌వెల్స్‌ చుట్టూ ముగ్గులు పోసి, ఇంకుడు గుంతల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గ్రామ సర్పంచి మందుల నాగయ్య పాల్గొని ముగ్గులు పోయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం కారణంగా భవిష్యత్తులో గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున నీటి ఎద్దడి ఏర్పడకుండా, ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే విధంగా బోర్‌వెల్స్ వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ సర్పంచి మందుల నాగయ్య తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని నూతనంగా నిర్మించే ఇళ్లకు తప్పకుండా ఇంకుడు గుంట వచ్చే విధంగా ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అన్నారు. నీటి సంరక్షణే మన బాధ్యత — ప్రతి చుక్కను ఒడిసిపడదాం, భవిష్యత్ తరాలకు నీటిని అందిద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అవినాష్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జైసింహా రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ భిక్షం, వార్డు సభ్యులు ఖాజా, సక్రు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular