ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని తమ్మర బండ పాలెం అంగనవాడి ఫస్ట్ సెంటర్ లో శనివారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ వస్త్రాధారణలో పిల్లలను వ్యవహరించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ ఎం వెంకటరమణ మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ లో ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని పిల్లలు ఎదగాలన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లులు, పిల్లలు, అంగన్వాడి ఆయా, తదితరులు పాల్గొన్నారు.



