దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి……
:ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటాయి…..
:అన్నదానాలు పుణ్య కార్యాలు…….
:బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక………
:అన్నదానం ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యు రాలు బండారు కవితా అమరేందర్ రెడ్డి…
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్): దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండారు కవిత అమరేందర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అన్ని వేళలా అందిస్తానని, భక్తి భావంతో నిర్వహించే పూజా కార్యక్రమాలు, అన్నదానాలు సమాజంలో ఐక్యతను, సేవా భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అన్నదానం మహోన్నతమైన పుణ్యకార్యమని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని పేర్కొన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని నయానగర్ రెండో వీధి, మదర్ థెరిస్సా బజార్లో ప్రతిష్ఠించిన దుర్గా మాత విగ్రహం వద్ద స్థానిక కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు, విద్యా వేత్త బాణాల వసంత వెంకట్ రెడ్డి,ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆమె అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

పండుగలు, ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భక్తిశ్రద్ధలతో దుర్గా మాతను ఆరాధిస్తూ ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రత్యేక గుర్తింపు అని ఆమె అన్నారు. ప్రకృతిని పూల రూపంలో ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబరాలు నిర్వహించడం మన ప్రాంతీయ సంస్కృతిలోని ప్రత్యేకతను చాటుతుందని వివరించారు. మహిళల ఐక్యతకు, కుటుంబ బంధాలకు, సామాజిక సమైక్యతకు బతుకమ్మ వేడుకలు ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. ప్రకృతిని గౌరవించడం, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను గుర్తుచేయడం ఈ పండుగలోని గొప్ప సందేశమని పేర్కొన్నారు.
ప్రజలంతా పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో యువత, స్థానిక ప్రజలు చురుకుగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. సమాజంలో సేవా దృక్పథాన్ని పెంపొందించేందుకు అన్నదానాలు, సేవా కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. దుర్గా మాత కృపతో కోదాడ పట్టణ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యా వేత్త బాణాల వసంత వెంకట్ రెడ్డి,స్థానిక కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ చందర్ రావు,శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ కమిటీ సభ్యులు పగిడిమర్రి మదన్ మోహన్, కక్కిరేణి రామారావు, రామినేని శ్రీనివాస్ రావు, ఈదుల కృష్ణయ్య, బొలిశెట్టి కృష్ణయ్య, షేక్ మీరా,మద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కోళ్లూరి వేణు, బాలకృష్ణ, కక్కిరేణి నరేష్, మర్రు రవీందర్ సార్, కక్కిరేణి లచ్చయ్య, నర్సింహా రావు, కట్టమూరి సత్యనారాయణ, కవిత అమరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు నారాయణ రెడ్డి మొదలగు వారు ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కాగా మూడు వేల మందికి అన్న దానం చేశారు.



